మైదుకూరులో యువకుడు అదృశ్యం
KDP: మైదుకూరు టౌన్ గాంధీనగరుకు చెందిన ఇర్ఫాన్ అనే యువకుడు అదృశ్యమైనట్లు అర్బన్ CI కె.రమణారెడ్డి శుక్రవారం తెలిపారు.శుక్రవారం ఇర్ఫాన్ ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లి తిరిగి రాలేదని, అతని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇర్ఫాన్ ఆచూకీ తెలిసిన వారు పీఎస్ 08564-231233, సీఐ 9121100618, ఎస్సై 9121100619 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.