ప్రముఖ నటుడు కన్నుమూత
మలయాళ నటుడు, దర్శకుడు ఇ.ఏ. రాజేంద్రన్ (71) కన్నుమూశాడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గ్రాడ్యుయేట్ అయిన ఆయన.. కాళిదాస కళాకేంద్రం ద్వారా నాటక రంగానికి విశేష సేవలు అందించాడు. సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన, వృద్ధాప్య సమస్యలతో కొల్లంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.