కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశం
BDK: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం కొమరారం గ్రామంలో ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు ఇవాళ ఎమ్మెల్యే కోరం కనకయ్యను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రైతుల కష్టం గుర్తించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి కొమరారంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.