నగదు రహితంగా మారుతున్న హైదరాబాద్
హైదరాబాద్ డిజిటల్ ట్రాన్సాక్షన్లలో కొత్త రికార్డును నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది UPI లావాదేవీలు 33% పెరిగి, దక్షిణ భారతదేశంలోని ఇతర నగరాలకంటే HYD ముందు నిలిచింది. ఓ సర్వే ప్రకారం నగరాల్లో 52% ట్రాన్సాక్షన్లు UPI ద్వారా జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులపై ప్రజల విశ్వాసం పెరుగుతుండడంతో HYD నగదు రహిత వాణిజ్యం వైపు వేగంగా సాగుతోంది.