నిర్లక్ష్యంపై కలెక్టర్ వేటు.. అంగన్వాడీ కార్యకర్త సస్పెన్షన్
ATP: బొమ్మనహాల్(M) కురువళ్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త పార్వతిపై కలెక్టర్ ఆనంద్ సస్పెన్షన్ వేటు వేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన పిల్లల వయసుకు తగ్గ బరువులు, ఆన్‌లైన్‌లో నమోదు, రికార్డుల నిర్వహణలో లోపాలను గుర్తించారు. ఈ లోపాలపై ఆమెను సస్పెండ్ చేయాలని ICDS పీడీని ఆదేశించారు. విధులకు గైర్హాజరైన డాక్టర్ శ్రీలక్ష్మిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.