దాతృత్వం చాటుకున్న కురవి ఎస్సై గండ్రాతి సతీష్

దాతృత్వం చాటుకున్న కురవి ఎస్సై గండ్రాతి సతీష్

MHBD: కురవి మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన జంటగి నీలమ్మ విద్యుత్ షాక్‌తో మరణించింది. ఆ కేసు విచారణలో భాగంగా ఎస్సై గండ్రాతి సతీష్ బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లిన సమయంలో వారి దినస్థితిని చూసి చలించిపోయారు. తక్షణమే ఎస్సై ఆ కుటుంబానికి రూ. 5 వేలు ఆర్ధిక సహాయాన్ని అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీంతో గ్రామస్తులు ఎస్సైని అభినందించారు.