విచిత్ర వాతావరణం.. మంచు పరుచుకున్న ఓరుగల్లు..!

WGL: జిల్లాలో వాతావరణ పరిస్థితులు విచిత్రంగా మారుతున్నాయి. నాలుగు రోజుల నుంచి తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ప్రస్తుతం రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపిన నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి జిల్లాలో మబ్బు పట్టి మంచు పరుచుకుంది. శీతాకాలంలో వచ్చే మంచు వర్షాకాలంలో రావడంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.