ఏలూరు కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా

ELR: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై ఏలూరు కలెక్టరేట్ ముందు శనివారం రైతులు ధర్నా చేపట్టారు. మా ధాన్యం ప్రభుత్వం కొనాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచి, ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ అన్నారు.