VIDEO: గణేష్ శోభాయాత్రలో ఉద్రిక్తత

NLG: పాతబస్తీలోని గణేష్ శోభాయాత్రలో కాంగ్రెస్, BJP కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. BJP జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని స్టేజ్ పైకి ఆహ్వానించలేదని ఆ పార్టీ శ్రేణులు మంత్రి కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.