ఖాళీ స్థలాల యజమానులకు హెచ్చరికలు

ఖాళీ స్థలాల యజమానులకు హెచ్చరికలు

ELR: నూజివీడు పట్టణంలోని ఖాళీ స్థలాలలో పెరిగిన మొక్కలు, చెట్లను యజమానులు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఇవాళ తెలిపారు. మొక్కలు చెట్లు పెరగటడంతో విషసర్పాలకు నిలయమై స్థానికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఖాళీ స్థలాలను బాగు చేయించని నేపథ్యంలో మున్సిపల్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.