టాలెంట్‌కు కొదవలేదు: సూర్య
T20ల్లో భారత్ ఏకకాలంలో రెండు, మూడు జట్లను బరిలోకి దించగలదని కెప్టెన్ సూర్యకుమార్ ధీమా వ్యక్తం చేశాడు. IPL, దేశవాళీ క్రికెట్ వల్ల దేశంలో ప్రతిభావంతులకు కొదవలేదని, భారత క్రికెట్ మూలాలు చాలా బలంగా ఉన్నాయని తెలిపాడు. ప్రస్తుత భారత టీ20 జట్టు అత్యుత్తమమని కొనియాడాడు. కాగా, సూర్య సారథ్యంలో భారత్ ఆడిన 52 మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.