నేరుగా ఓటీటీలోకి 'మేడిన్ కొరియా'
ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రా.కార్తిక్ రూపొందించిన సినిమా 'మేడిన్ కొరియా'. ఈ మూవీ నేరుగా ఓటీటీ 'నెట్‌ప్లిక్స్'లో ఈనెల 12న తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ఇందులో దక్షిణ కొరియా వెళ్లాలనే లక్ష్యం ఉన్న అమ్మాయిగా ప్రియాంక నటించింది.