హలిగేరా గ్రామ సమస్యలపై ఎంపీకు వినతి
KRNL: కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజును ఆస్పరి జనసేన పార్టీ మండల కార్యదర్శి హనుమేశ్ హాలిగేర గ్రామ టీడీపీ నాయకులు తలారి నల్లగుట్టయ్య, లక్ష్మన్న ఇవాళ కలిశారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి ట్యాంక్ చిన్నగా ఉండటం వల్ల జనాభాకు తగ్గట్టు నూతన ట్యాంక్‌ను నిర్మించాలని కోరారు.