VIDEO: ఇల్లందలో అయ్యప్ప ఆలయంలో మెట్లపూజ
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని అయ్యప్ప ఆలయంలో బుధవారం మెట్లపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వఖాదీ బోర్డు డైరెక్టర్ ఈగ మల్లేశంతో పాటు అయ్యప్ప భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెట్లపూజ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల శరణుఘోషలతో మార్మోగాయి. గ్రామస్థులు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.