కోవెలకుంట్లలో పెరుగుతున్న కాపర్ వైర్ చోరీలు

కోవెలకుంట్లలో  పెరుగుతున్న కాపర్ వైర్ చోరీలు

NDL: కోవెలకుంట్ల మండలంలో విద్యుత్ మోటార్లు ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ చోరీలు పెరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ నది వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం చేసి 50 కిలోల కాపర్ వైర్ ఎత్తుకెళ్లినట్లు సీఐ హనుమంతు నాయక్ వెల్లడించారు. ఈ దొంగతనాల పట్ల నిఘా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.