బంగారం ధరకు.. దొంగల సంచార భయం..!
MDCL: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఉప్పల్‌లో చోరీలపై భయం నెలకొంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇళ్లు లక్ష్యంగా దొంగలు రెక్కీ నిర్వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళ అనుమానాస్పద కదలికలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు.