'ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలి'
SRCL: ప్రతి ఒక్కరు ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. 99 రోజుల 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఆహార భద్రత ప్రమాణాలు అలాగే, ఆహార నిల్వలు నిర్ణీత కాలంలో పూర్తి చేసే అంశంపై సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఆహార కల్తీ నివారించాలని ఆయన పిలుపునిచ్చారు.