పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన డీజీపీ

పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన డీజీపీ

గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్, CCS ఇన్‌స్పెక్టర్ గోపి, ఎస్సై విఠల్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసులు నమోదు చేసినట్లు ఫిర్యాదు రావడంతో.. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.