VIDEO: 'ఆసరలేని మహిళకి ఆర్థిక సాయం'

SKLM: సంతబొమ్మాలి మండలం పంగజగ్గుపేట గ్రామానికి చెందిన నీలాపు చిన్నమ్మి ఆసరలేని ఒక అనాథ. కనీసం తల దాచుకోడానికి సొంత ఇల్లు కూడా లేదని తెలుసుకున్న వల్లేవలస మనబడి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఆమె గృహ నిర్మాణానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆ గ్రామస్తులు మనబడి అసోసియేషన్ చేసిన సేవలను కొనియాడుతూ అభినందించారు.