సీఎం సభకు 1700 మంది పోలీసులతో విధులు

KRNL: సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం కర్నూలు నగర శివారు ప్రాంతంలో ఉన్న మెగాసిరి ఫంక్షన్ హాల్ నందు బందోబస్తు విధులకు హాజరయ్యే పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులను నిర్వహించాలని పోలీసులకు సూచించాడు.