రాచర్ల రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

రాచర్ల రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

ప్రకాశం: రసాయన ఎరువుల వినియోగంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ సూచించారు. రాచర్ల మండలం అనుమలవీడులో మట్టి నమూనా సేకరణ విధానంపై రైతులకు ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రైతు మూడేళ్లకోసారి మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.