'లేబ‌ర్ కోడ్‌ల‌ను ర‌ద్దు చేయాలి'

'లేబ‌ర్ కోడ్‌ల‌ను ర‌ద్దు చేయాలి'

VSP: విశాఖ‌ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శ‌నివారం ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌ల అమలును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్‌లు కార్మికుల హక్కులను కాలరాసి, వారిని కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేందుకు ఉద్దేశించినవని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. ఈ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని వారు కోరారు.