ALERT: పలు జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వాతావరణం మారింది. ఇవాళ కాకినాడ, కోనసీమ, తూ.గో. జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నిన్న తూ.గో. జిల్లా పైడిమెట్టలో అత్యధికంగా 44 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.