పోచమ్మ బోనాలకు విరాళం

RR: కడ్తాల్‌లోని పోచమ్మ బోనాల ఉత్సవాలకు డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రూ.50వేల విరాళాన్ని అందజేశారు. శుక్రవారం ఆయన ఈ చెక్కును ఆలయ కమిటీ ఛైర్మన్ సత్యం యాదవ్‌కు అందించారు. బోనాలను ప్రశాంతంగా జరుపుకోవాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.