నియోజకవర్గానికి 2 వేల కనెక్షన్లే లక్ష్యం: గొట్టిపాటి

నియోజకవర్గానికి 2 వేల కనెక్షన్లే లక్ష్యం: గొట్టిపాటి

AP: ప్రతి నియోజకవర్గంలో 2 వేల చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు కల్పించడమే లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నామని, డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సరఫరాకు సూర్యఘర్ చక్కటి పరిష్కారమన్నారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానళ్ల ఖర్చులో భారీగా సబ్సిడీలు, చ.అ. రూపాయి చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లిస్తుందన్నారు.