ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించండి: కలెక్టర్

ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించండి: కలెక్టర్

WGL: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.