'రైతు సంఘం సభలను జయప్రదం చేయండి'

'రైతు సంఘం సభలను జయప్రదం చేయండి'

NLG: ఈ నెల 14న జిల్లా కేంద్రంలో జరిగే 24వ తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సంఘం అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం మిర్యాలగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహాసభలో తీర్మానించనున్నట్లు తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.