కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవాబ్ సాహెబ్ మృతి
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవాబ్ సాహెబ్ గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నవాబ్ సాహెబ్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేశారని ఆయనని గుర్తు చేసుకున్నారు.