'ఇరువర్గాల దాడులపై కేసు నమోదు'
KMM: చింతకాని మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వీరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపురంలో కన్నెబోయిన కుటుంబరావు ఇంటిపై ఉసికల లక్ష్మీనారాయణతోపాటు మరో 14 మంది దాడి చేసి, ఆస్తి నష్టం కలిగించారు. కుటుంబరావు ఫిర్యాదుతో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.