'అకారణంగా తీసేశారు’

KRNL: వెల్దుర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వీపర్లను అకారణంగా తొలగించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రాణాలకు తెగించి ఆసుపత్రిలో సేవ చేశామని, ఆ సమయంలో కాలనీవాసులు మమ్మల్ని దూరం పెట్టారని చెప్పారు. ఇంత పని చేసిన మాకు గుర్తింపు లేకుండా నేడు విధుల నుంచి తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.