'పుల్వామా వీర సైనికుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది'

'పుల్వామా వీర సైనికుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది'

కోనసీమ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవానుల పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఘన నివాళులు అర్పించారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన ఆ వీర సైనికుల త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికుల సేవలు అపారమని కొనియాడారు.