జనగణనపై అవగాహన పెంచుకోవాలి: జేసీ
ATP: భారత ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని అనంతపురం జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ గురువారం ఆదేశించారు. జేఎన్టీయూలో మూడు రోజులపాటు జరిగిన శిక్షణా కార్యక్రమం ముగింపులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు మొదటి దశలో గృహ గణన జరుగుతుందని తెలిపారు.