గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం
ASR: ముంచంగిపుట్టు మండలం మాకవరం శివారు డుడుమ వెళ్లే దారిలో సుమారు 15-20 ఏళ్ల గుర్తుతెలియని యువతి మృతదేహం రోడ్డుపై లభ్యమైంది. మృతురాలు కుంకుమ రంగు టాప్, ఐస్ గ్రీన్ ప్యాంట్, నల్ల చున్నీ ధరించి ఉంది. రోడ్డు ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు వెంటనే ముంచంగిపుట్టు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.