ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
VSP: ఆంధ్రా మెడికల్ కాలేజీ కాబ్ ఆడిటోరియంలో “ఆహ్వాన్ 2025” ఫ్రెషర్స్ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ హాజరయ్యారు. విద్య, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ సంధ్యాదేవితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.