పిడుగుపాటుకు 6 మేకలు మృతి
PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని లోవముఠా జోగిపురం గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు 6 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన గిరిజన రైతు మేకలను మేపుతున్న సమయంలో పిడుగు పడింది. ఈ ఘటనలో మేకలు మృతి చెందగా, అక్కడ ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.