అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిట

SRD: ప్రజావాణి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ అర్జీదారులతో సోమవారం కిటకిటలాడింది. తమ సమస్యలు విన్నవించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 10 గంటలకు అర్జీదారులు వచ్చారు. 10:30 నుంచి అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు అధికారులు హామీ ఇచ్చారు.