విశాఖ పార్లమెంట్ పరిశీలకునిగా కదిరి

విశాఖ పార్లమెంట్ పరిశీలకునిగా కదిరి

ప్రకాశం: విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా కనిగిరి మాజీ ఎమ్మేల్యే కదిరి బాబురావు నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం జాబితాలో కదిరి పేరు విడుదల చేశారు. కదిరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని కదిరి అన్నారు.