రోడ్డుపై గుంత ఆదమరిస్తే పెద్ద ప్రమాదం.!
KDP: పులివెందుల-ముద్దనూరు ప్రధాన రహదారిలో మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న రింగ్ రోడ్డు సర్కిల్లో పెద్ద గుంత ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు చాలామంది ఆ గుంతను గమనించక ప్రమాదానికి గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ మార్గం ద్వారా కాలేజీ విద్యార్థులు, పరిశ్రమల కార్మికులు ఎంతోమంది వెళ్తుంటారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతను పూడ్చివేయాలని ప్రజలు కోరుతున్నారు.