HYDకి చేరుకున్న రాహుల్‌గాంధీ
HYD: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ HYDకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి వికారాబాద్‌లోని అనంతగిరిలో జరుగుతున్న DCC అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశనిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. రాహుల్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.