రౌడీషీటర్లలో దడ పుట్టిస్తున్న పోలీసులు..!
NLR: నగరంలో క్రైం కట్టడికి SP అజిత వేజేండ్ల తన మార్క్ పాలనతో ముందుకు వెళుతున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో నగరంలోని CIలు సాంబశివరావు, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, కళ్యాణ్ రాజు, సోమయ్య, కోటేశ్వరరావు నేరగాళ్లపై ఉక్కపాదం మోపుతున్నారు. రాత్రుళ్లు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక రౌడీ షీటర్లను ఊరేగిస్తూ ప్రజల్లో భయం పోగొడుతున్నారు.