బాలిరెడ్డపల్లి సమీపంలో కారు బోల్తా

బాలిరెడ్డపల్లి సమీపంలో కారు బోల్తా

ప్రకాశం: కొమరోలు మండలం బాలిరెడ్డిపల్లి సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. కారు బోల్తా పడిన వెంటనే బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.