యాజలిలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి: DLDO

యాజలిలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి: DLDO

BPT: కర్లపాలెం మండలం యాజలిలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని డీఎల్‌డీఓ విజయలక్ష్మి, డీపీఓ ప్రభాకర్ రావు పంచాయతీ అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఓ వ్యక్తికి డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో జిల్లా అధికారులు బుధవారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.