బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

NZB: సిరికొండ మండలంలోని బీజేపీ నాయకులను పోలీసులు ఇవాళ ఉదయం ముందస్తు అరెస్ట్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచిన భూపతి రెడ్డి వరదలకు నష్టపోయిన రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని చర్చకు రమ్మని పిలుపునిస్తే రాకుండా అరెస్టు చేయించడం తగదన్నారు. అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, ప్రభాకర్, బాలయ్య ఉన్నారు.