డోన్ గ్రంథాలయానికి పూర్వవైభవం కోరుతూ విజ్ఞప్తి
NDL: డోన్ పట్టణంలోని చారిత్రక గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాలుగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఈ కేంద్రం నుంచి అనేక మంది ఉన్నత స్థాయికి ఎదిగారు. తమ విజయానికి పునాది అయిన గ్రంథాలయానికి తక్షణమే మరమ్మతులు చేసి, ఆధునిక సదుపాయాలు కల్పించాలని ఆదివారం వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి పూర్వవైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.