'ఇందిరమ్మ ఇళ్లతోనే పేదల సొంతింటి కల సాకారం'
MBNR: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారానే పేదల సొంతింటి కల నిజమవుతోందని నగర డిప్యూటీ మేయర్ మరేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. 11వ డివిజన్ బండమీదిపల్లిలో కుర్వ శ్రీను-సుజాత దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ పథకం నిరుపేదలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తోందని పేర్కొన్నారు.