సమాజ అభివృద్ధికి తోడ్పడదాం: మంత్రి సీతక్క
NZB: మహిళలకు అవకాశాలు ఇవ్వటం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడతామని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత అవగాహన సదస్సును నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళా సాధికారతకు పాటుపడాలని పిలుపునిచ్చారు.