22వ వార్డులో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
MHBD: మహబూబాబాద్ మున్సిపాలిటీ 22వ వార్డు కొండపల్లి గోపాలరావు నగర్‌లో విద్యుత్ స్తంభాల లేమితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో, సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీ.అజయ్ సారధి రెడ్డి విద్యుత్ అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. అవసరమైన ప్రదేశాల్లో వెంటనే స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.