VIDEO: భారీ అగ్నిప్రమాదం.. 4 పూరిళ్లు దగ్ధం
ఏలూరు: వేలేరుపాడు మండలంలోని చిగురుమామిడిలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చండ్రుగొండ సత్తిబాబు, చిన్న నరసింహులు, సింగ్ బాబు, ఎక్కిల శ్రీనులకు చెందిన నాలుగు పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినప్పటికీ, ఆస్తి మొత్తం బూడిదవడం జరిగింది.