PHCలో మాతృత్వ సురక్ష అభయాన్
ELR: భీమడోలు మండలం పూళ్ల PHCలో సోమవారం ప్రధాన మంత్రి మాతృత్వ సురక్ష అభయాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యాధికారులు డా. అరుణజ్యోతి, డా.ప్రదీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పాల్గొన్నారు. ప్రతి నెల 9, 10వ తేదీల్లో గర్భవతులకు నెలవారీ పరీక్షలు నిర్వహిస్తామని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.