ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్
SRCL: రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో శనివారం ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని, ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.